నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి : అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ

నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి : అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ

ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి వంట గది, సామగ్రి నిల్వ చేసే గది, నిత్యావసర సరుకుల నాణ్యత, మెనూ అమలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. 

ప్రభుత్వం ప్రతీ పాఠశాలలో తాగునీరు, అదనపు తరగతి గదులు, విద్యుత్, విద్యార్థులకు వేర్వేరుగా టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పౌష్టికాహారంతో కూడిన మెనూ అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని టీచర్లకు సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.