బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ప్లాట్లు.. రూ.13లక్షలకే సింగిల్ బెడ్ రూం

బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ప్లాట్లు.. రూ.13లక్షలకే  సింగిల్ బెడ్ రూం

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో ఉన్న సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల వేలానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బండ్లగూడలో సింగిల్ బెడ్రూమ్ ​ఫ్లాట్లు 15 (రూ. 15లక్షలు , రూ. 18 లక్షలు ),  పోచారంలో 274 ఫ్లాట్లను ( రూ.13 లక్షలు, 2బీహెచ్ కే రూ.19 లక్షలు) వేలంలో ఉంచారు.

 వచ్చే నెల 4, 5 తేదీల్లో ఈ ఫ్లాట్లకు లాటరీ  నిర్వహిస్తామని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ నోటిఫికేషన్ లో వెల్లడించారు.  సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు టోకెన్ అమౌంట్ గా రూ.1 లక్ష, డబుల్ బెడ్రూమ్ కు రూ.2 లక్షలు డీడీ రూపంలో మీ సేవలో ఎండీ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పేరుతో  చెల్లించాలని సూచించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో సొంత ఇండ్లు ఉన్న వాళ్లు అనర్హులు అని వెల్లడించారు.