
కామారెడ్డి టౌన్, వెలుగు : రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కోసం జిల్లాలో 44,655 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో రూ.50 వేల లోన్ఉన్న దరఖాస్తులను సంబంధిత బ్యాంకులకు వెంటనే పంపించాలన్నారు.
ఈనెల 14 వరకు దరఖాస్తులను బ్యాంకుఅధికారులు పరిశీలించి మండల కమిటీకి పంపించాలని, అక్కడి నుంచి జిల్లా కమిటీకి పంపాలన్నారు. ఈనెల 30లోపు జిల్లా కమిటీ ఆమోదించి మంత్రికి సిఫారస్సు చేయాలని ఆదేశించారు. జూన్ 2న ఎంపిక చేసిన లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టాన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్చందర్, డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.