ఆయుధ పూజ.. అంతలోనే నింగిలోకి దూసుకెళ్లి..

ఆయుధ పూజ.. అంతలోనే నింగిలోకి దూసుకెళ్లి..
  • ఆయుధ పూజ.. అంతలోనే రాఫెల్ లో రైడ్
  • సౌకర్యంగా, స్మూత్ గా ఉంది: రాజ్ నాథ్

మెరిగ్నాక్: తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకున్న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంటనే తన కోరిక తీర్చుకున్నారు. అధికారికంగా ఫైటర్ జెట్ ను ఫ్రాన్స్ నుంచి అదుకున్న ఆయన ఆయుధ పూజ చేశారు. పూలు, నిమ్మకాయలతో ఫారెన్ లోనూ దసరా సంప్రదాయాన్ని ఆచరించారాయన. ఆ తర్వాత మాట్లాడుతూ దీనిలో ప్రయాణించాలని ఉత్సాహంగా ఉందన్నారు.

వెంటనే.. టెస్ట్ రైడ్

రాజ్ నాథ్ కోరిన వెంటనే ఫ్రాన్ అధికారులు ఏర్పాట్లు చేసేశారు. రాఫెల్ తయారీ కంపెనీ దసాల్ట్ హెడ్ టెస్ట్ పైలట్ ఫిలిప్ జెట్ లోకి ఎక్కారు. రాజ్ నాథ్ ను తనతో పాటు రాఫెల్ లో కూర్చోబెట్టుకుని ఆకాశంలోకి దూసుకెళ్లారు.

నేను ఎప్పుడూ ఊహించలేదు

రాఫెల్ లో ప్రయాణం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాఫెల్ లో రైడ్ చాలా సౌకర్యంగా, స్మూత్ గా అనిపించిందన్నారు రాజ్ నాథ్ సింగ్. తాను సూపర్ సోనిక్ యుద్ధ విమానంలో ప్రయాణించే రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు.

గత నెలలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ద విమానం తేజస్ లో రాజ్ నాథ్ సింగ్ ప్రయాణించారు. అలాగే యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య లోనూ ఆయన పర్యటించారు. సైనికుడిలా మారి మెషీన్ గన్ ను కాల్చారు.