ఏపీ: పుట్టపర్తిలో రూ.16వేలకోట్లతో.. AMCA ఫైటర్ జెట్ ఇన్ ఫ్రాస్టక్ఛర్ ప్రాజెక్టు

ఏపీ: పుట్టపర్తిలో రూ.16వేలకోట్లతో.. AMCA ఫైటర్ జెట్ ఇన్ ఫ్రాస్టక్ఛర్ ప్రాజెక్టు

ఏపీలోని పుట్టపర్తిలోAMCA ఫైటర్ జెట్ల ఇన్ ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. రూ.16వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీలోని 7500 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టుతో భారత వైమానిక దళం కోసం స్వదేశీ 5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీ వేగవంతం చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ రంగానికి కీలక కేంద్రంగా మారనుంది.

మే 15, 2026 శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రూ.15వేల 803వేల కోట్ల  భారీ వ్యయంతో 5th జనరేషన్ అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ఫైటర్ జెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు ఏపీ సిఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన  చేశారు రక్షణమంత్రి రాజనాథ్ సింగ్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.పుట్టపర్తిలో సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ రక్షణ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7వేల 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా.   

AMCA ఫైటర్ జెట్ల తయారీ కేంద్రంతో పాటు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్, నావల్ సిస్టమ్స్ ఫెసిలిటీ, డిఫెన్స్ ఎనర్జెటిక్స్ యూనిట్లు, డ్రోన్ సిటీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత వైమానిక దళం కోసం స్వదేశీ 5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ల అభివృద్ధిని వేగవంతం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ రంగానికి కీలక కేంద్రంగా మారనుంది.