‘అగ్నిపథ్’ స్కీమ్ పై రాజీపడే ప్రసక్తే లేదు : కేంద్రం

‘అగ్నిపథ్’ స్కీమ్ పై రాజీపడే ప్రసక్తే లేదు : కేంద్రం

‘అగ్నిపథ్’ స్కీమ్, దేశ వ్యాప్త ఆందోళనలపై త్రివిధ దళాధిపతులతో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సుదీర్ఘంగా చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మాజీ సైనికుల సంఘంతో సహా పలువురు నిపుణులతో సుమారు రెండేళ్ల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాతే ‘అగ్నిపథ్’ స్కీమ్ ను ఏకాభిప్రాయంతో రూపొందించామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం అగ్నిపథ్ పై అపోహలు వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా సైనిక నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్న రక్షణమంత్రి.. దీని ద్వారా నియమితులయ్యే సిబ్బందికి ఇచ్చే శిక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మరోవైపు డిఫెన్స్ మినిస్ట్రీ కీలక ప్రకటన విడుదల చేసింది. రిటైర్ అయిన అగ్నివీరుల కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాల నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అంతేకాకుండా వీటిలో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇస్తున్నట్టు స్టేట్ మెట్ ఇచ్చింది. ఇంతకుముందు రెండేళ్లు సడలించింది. ఓవరాల్ గా  ఫస్ట్ బ్యాచ్  అగ్నివీరులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు దక్కుతుందని స్పష్టం చేసింది.