జవాన్లను కలవడం గర్వంగా భావిస్తా..

జవాన్లను కలవడం గర్వంగా భావిస్తా..

ఇంఫాల్: ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నానని, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో చేరలేకపోయానని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. రెండ్రోజుల పర్యటన కోసం మణిపూర్ కు వెళ్లిన ఆయన.. శుక్రవారం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి ఇంఫాల్ లోని ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ (సౌత్) హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అస్సాం రైఫిల్స్, 57వ మౌంటెయిన్ డివిజన్ జవాన్లను ఉద్దేశించి రాజ్ నాథ్ మాట్లాడారు. తన చిన్ననాటి కలను వారితో షేర్ చేసుకున్నారు. ‘‘నేనూ ఆర్మీలో చేరాలని అనుకున్నా. షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కూడా రాశాను. ఆ టైమ్​లోనే నా తండ్రి చనిపోవడం, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆర్మీలో చేరలేకపోయాను” అని రాజ్​నాథ్​ భావోద్వేగానికి గురయ్యారు. ఆర్మీ యూనిఫామ్ లో చరిష్మా ఉందని.. చిన్న పిల్లాడికి ఆ డ్రెస్ ఇచ్చినా, వాళ్ల పర్సనాలిటీలో మార్పు కనిపిస్తుందని అన్నారు. 

జవాన్లను కలవడం గర్వంగా భావిస్తా..

చైనాతో గొడవ టైమ్ లో మన సైనికులు ఎంతో ధైర్యంగా పోరాడారని రాజ్ నాథ్ కొనియాడారు. ‘‘చైనాతో గొడవ జరిగినప్పుడు మీకు అన్ని వివరాలు తెలియకపోవచ్చు. కానీ నాకు, ఆర్మీ చీఫ్ కు మన జవాన్లు చూపెట్టిన ధైర్యసాహసాలు తెలుసు. దేశం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది” అని అన్నారు. సైనికులను కలవడం తనకు గర్వంగా ఉంటుందని చెప్పారు. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా జవాన్లను కలుస్తాను. మణిపూర్ పర్యటన ఖరారైనప్పుడు కూడా.. అస్సాం రైఫిల్స్, 57వ మౌంటెయిన్ డివిజన్ సైనికులను కలవాలని అనుకుంటున్నానని ఆర్మీ చీఫ్ కు చెప్పాను” అని తెలిపారు. ‘‘డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు ఏదో ఒక మార్గంలో దేశానికి సేవ చేస్తున్నారు. కానీ మీరు నిర్వర్తించే బాధ్యతలు ఒక వృత్తి, సేవ కంటే ఎక్కువ” అని 
రాజ్ నాథ్ సింగ్​  కొనియాడారు.