మోడీ పర్యటన సైనికుల్లో ధైర్యాన్ని పెంచింది

మోడీ పర్యటన సైనికుల్లో ధైర్యాన్ని పెంచింది
  • రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మోడీ పర్యటన సైనికుల్లో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మోడీకి థ్యాంక్స్‌ చెప్పారు. “ లడాఖ్‌ వెళ్లడం, సోల్జర్స్‌ను కలుసుకుని వాళ్లను ఎంకరేజ్‌ చేయడం సైనికుల్లో కచ్చితంగా ధైర్యాన్ని పెంచింది. ఆర్మీ చేతుల్లో బోర్డర్స్‌ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి” అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. గాల్వాన్‌ ఘటన జరిగిన తర్వాత మోడీ మొదటిసారి శుక్రవారం లడాఖ్‌ పర్యటనకు వెళ్లారు. ఆర్మీ చీఫ్‌ నర్వానే, సీడీఎస్‌తో బిపిన్‌ రావత్‌తో కలిసి పర్యటించిన మోడీ సైనికులతో మాట్లాడారు. ఆర్మీ, ఎయిర్‌‌ఫోర్స్‌, ఐటీబీపీ సిబ్బందితో మోడీ ముచ్చటించారు.