జమ్మూలో పర్యటించిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్

జమ్మూలో పర్యటించిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్

న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి ఎందరో సైనికులు ప్రాణ త్యాగాలు చేశారని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ స్మరించుకున్నారు. వారంద రికీ సెల్యూట్​ చేస్తున్నానని చెప్పారు. 23వ కార్గిల్ దివస్ మంగళవారం జరగనున్న సందర్భంగా మంత్రి జమ్మూలో పర్యటించారు. 1999 కార్గిల్​ యుద్ధం లో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను ఆయన సత్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత నుంచి లడఖ్, జమ్మూకాశ్మీర్​పై శత్రువు లు టార్గెట్ చేశారని, మన సైనికులు వీరోచితంగా పోరాడి వాళ్ల పన్నాగాల ను తిప్పికొట్టారని అన్నారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పారు. ఇప్పడు మన దేశం ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఉందన్నారు. విజయ్ దివస్​ను పురస్కరించుకుని కార్గిల్ యుద్ధవీరుల మెమోరియల్​ వద్ద అధికారులు ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.