గతించిన చరిత్రకు సాక్ష్యంగా.. రాజు వెడ్స్ రాంబాయి

గతించిన చరిత్రకు సాక్ష్యంగా.. రాజు వెడ్స్ రాంబాయి

అఖిల్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల,  రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’.  శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ కీలక పాత్రలు పోషించారు.  ఈ నెల 21న  వంశీ నందిపాటి,  బన్నీ వాస్   థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.  మంగళవారం ఈ చిత్రం నుంచి  ‘రాంబాయి నీ మీద నాకు..’ అనే  లిరికల్ సాంగ్‌‌‌‌ను  మంచు మనోజ్, భూమా మౌనిక విడుదల చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. 

ఈ చిత్రం యువతతోపాటు ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని నటీనటులు అన్నారు.  ‘ప్రేమికులు ఈ సినిమాను చూసి నవ్వుతారు, ఏడుస్తారు. సినిమా చూస్తున్న వాళ్లకు వాళ్ల ప్రేమ గుర్తుకొస్తుంది’ అని డైరెక్టర్ సాయిలు కంపాటి చెప్పాడు.  నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘రాజు, రాంబాయి ప్రేమలో సంతోషం ఉంది, దు:ఖం ఉంది.  

గతించిన చరిత్రకు, ప్రస్తుత చరిత్రకు ఈ సినిమా ఒక సాక్ష్యంగా నిలుస్తుంది’ అని అన్నారు. నిర్మాత వంశీ నందిపాటి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి,  సింగర్ నల్లగొండ గద్దర్ నర్సన్నతోపాటు మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.