
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 11 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి, ఉత్తర ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నవంబరు 9న జరుగుతాయన్నారు. నామినేషన్లను దాఖలు చేసేందుకు చివరి తేదీ అక్టోబరు 27, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబరు 2. రాజ్యసభ ఎన్నికలు నవంబరు 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
వచ్చే నెలలో పదవీ కాలం ముగిసే రాజ్యసభ సభ్యుల్లో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ ఉన్నారు.