RRR : ఆస్కార్ విన్నర్స్ పై రాజ్యసభలో ప్రశంసలు

RRR : ఆస్కార్  విన్నర్స్ పై రాజ్యసభలో ప్రశంసలు

ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు ఆస్కార్ రావడంతో రాజ్యసభలో కేంద్రమంత్రులు, సభ్యులు అభినందనలు తెలిపారు. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్,  ఎంపీ కేశవరావు, బీహార్ ఎంపీ మనోజ్ కుమార్, ఉత్తర ప్రదేశ్ ఎంపీ సీమ ద్వివేది ఆస్కార్ విన్నర్స్ పై ప్రశంసలు కురిపించారు. ఈ విజయాలు భారతీయ కళాకారుల క్రియేటివిటీ, డెడికేషన్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. బెస్ట్ వరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. రెండు క్యాటగిరిలో భారత్ కు  ఆస్కార్ రావడం  సంతోషకరమన్నారు. 

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటుకు ఆస్కార్ రావడం ఒక్క తెలుగువాడిగా గర్వంగా ఉందన్నారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, కే కేశవరావు. మూవీ టీంను సత్కరించాలని కోరారు. ఆర్ఆర్ఆర్ టీం ఎన్టీఆర్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి, చంద్రబోస్, కీరవాణిలకు అభినందనలు తెలిపారు.