నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నెల రోజుల పాటు జరిగిన నిరసనల్లో ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, బయోమెట్రిక్ నిఘా వాడకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్. వీటి వల్ల వేలాది మంది విద్యార్థులు, జర్నలిస్టులు నిరసనకారులు రాజ్యాంగానికి విరుద్ధమైన సామూహిక నిఘాకు గురయ్యారని అన్నారు రహీమ్.
నిరసన జరిగినంత సేపు ఢిల్లీ పోలీసులు, కెమెరాల నెట్‌వర్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలు బయోమెట్రిక్ సాధనాల ద్వారా నిరసనలో పాల్గొన్నవారిపై నిఘా ఉంచారని పిటిషన్ లో పేర్కొన్నారు ఏఏ రహీమ్ .
పోలీసు సిబ్బంది నిరసనకారులను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌లు, శరీరానికి అమర్చుకునే కెమెరాలు, చేతిలో పట్టుకునే పరికరాలు, ఒక మొబైల్ కమాండ్-అండ్-కంట్రోల్ వాహనం, వ్యక్తిగత మొబైల్ ఫోన్లను ఉపయోగించి రికార్డ్ చేశారని అన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ , అజ్నాలెన్స్ ఏఐ-సామర్థ్యం గల స్మార్ట్ గ్లాసెస్‌తో కూడిన నిఘా వాహనాన్ని ఉపయోగించి ఆ ఫుటేజీని రియల్ టైం ప్రాసెస్ చేశారని అన్నారు.
సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జికి పాల్పడ్డారని... ప్రజల బియోమెట్రిక్ డేటా సేకరిస్తున్నట్లు వారికి తెలియకుండా పర్సనల్ మొబైల్ ఫోన్లను ఉపయోగించి సీక్రెట్ గా నిఘా పెట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు రహీమ్. వర్షంలో తడిసిన దుస్తులతో ఉన్న మహిళా నిరసనకారులను ఉద్దేశపూర్వకంగా ఫోటోలు తీశారని.. ఇది వారి ప్రైవసీకి, గౌరవానికి భంగం కలిగించడమేనని అన్నారు.
