వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభోత్సవం

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభోత్సవం

నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూర్‌లో రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామి నూతన ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం అంటే ఎన్నటికీ లయం కానిదని, అవి తరతరాలకు తరగని సంపదనిస్తూ జ్ఞానాన్ని అందిస్తూ మానవజాతికి జీవనాడిగా ఉంటాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోటి కొత్త ఆలయాలు నిర్మించడం కన్నా ప్రాచీన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం ధార్మికమైన కార్యమని, రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం పూర్వజన్మ సుకృతమే కాదు.. హైందవ ధర్మ పరిరక్షణలో కీలకమైన అంశమని కవిత పేర్కొన్నారు.

వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన
ఆలయ ప్రతిష్ఠాపన సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి మార్గదర్శకంలో శిలామయ, లోహమయమూర్తి, ధ్వజస్తంభ, యంత్ర ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేకం మహాధార్మిక క్రతువులను నిర్వహించారు. శనివారం (జూన్ 4న) ఉదయం రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపనలో భాగంగా ఆగమశాస్త్ర ప్రకారం స్తంభస్థాపన జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో క్రతువులు నిర్వహిస్తున్న ప్రధానార్చకులు నరసింహస్వామి ఉపాసకులు భార్గవ నరసింహస్వామి ఆధ్వర్యంలోని ధార్మిక అర్చక బృందం నిర్వహించింది. ఈ నెల 9వ తేదీ వరకు లోక కల్యాణార్థం, విశ్వశాంతి, ప్రజల ఆయురారోగ్య, ఐశ్వర్య సిద్ధి కోసం ఆరు రోజుల పాటు విశిష్ట పూజలను నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

బూస్టర్ డోసుగా కార్బెవాక్స్ టీకా.. పర్మిషన్ ఇచ్చిన డీసీజీఐ

గూగుల్ డూడుల్ గా ఐన్ స్టీన్ మెచ్చిన భారత శాస్త్రవేత్త