చర్చకు సిద్ధం.. కేటీఆర్ కు రామ్ చందర్ రావు, శ్రవణ్ సవాల్

చర్చకు సిద్ధం.. కేటీఆర్ కు రామ్ చందర్ రావు, శ్రవణ్ సవాల్

లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు.  కేటీఆర్ తో లైవ్ చర్చకు సిద్ధమన్నారు.  ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు చర్చిద్దాం దమ్ముంటే రా…అని సవాల్ విసిరారు. వస్తే తాను ఎమ్మెల్సీగా ఏం చేశానో చెబుతానన్నారు. అడ్వకెట్ లకు వంద కోట్లు ఫండ్ రావడానికి  తానే కారణమన్నారు. హై కోర్ట్ విభజన చేయించింది తామేనన్నారు. కరోనా టైమ్ లో పీపీఈ కిట్స్ ఇచ్చింది తామేనని..కేటీఆర్ వి అన్నీ అబద్ధాలేనన్నారు.

ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్దమన్న కేటీఆర్ సవాల్ ను స్వీకరించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. 26న మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ దగ్గర చర్చకు రెడీ అన్నారు శ్రవణ్. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చి కూడా భర్తీ చేసినట్లు చూపించారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 24 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్న కేటీఆర్ కామెంట్స్ పై మండిపడ్డారు దాసోజు శ్రవణ్ .