రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
నేషనల్ వైడ్ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం భోపాల్‌లో మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భోపాల్ మంత్రి విశ్వాస్ సారంగ్ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ఇదొక స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు. తన గుర్తింపు కోసం పోరాడే ఒక వ్యక్తి కథ. ఆ పోరాటం అందరి హృదయాలను తాకుతుంది. ఆలోచింపజేస్తుంది, స్ఫూర్తిని ఇస్తుంది. సినిమా చూసిన తర్వాత మళ్లీ మళ్లీ చూడాలనిపించే అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే సినిమా ఇది. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, నా ఫిల్మ్ లైబ్రరీలో ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది’ అని చెప్పాడు.
ఈ చిత్రంలో చాలా గొప్ప సందేశం ఉందని, చరణ్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా అని జాన్వీ కపూర్ చెప్పింది. ఈ చిత్రంలోని పాటలతోపాటు చరణ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని ఏఆర్ రెహమాన్ అన్నారు. ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన గొప్ప స్పోర్ట్స్ డ్రామా అని నిర్మాత వెంకట సతీష్ అన్నారు. నటులు దివ్యేందు శర్మ, రవి కిషన్ పాల్గొన్నారు.
మరోవైపు ఈ చిత్రం నుంచి మూడో పాటగా ఆదివారం ‘హల్లల్లల్లో’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో చరణ్‌తోపాటు శృతిహాసన్, జాన్వీ కపూర్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ ట్యూన్‌కు అనంతశ్రీరామ్ రాసిన లిరిక్స్, రక్షితా సురేష్ పాడిన విధానం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఇవన్నీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
