ఆర్జీవీ న్యూ కాన్సెప్ట్‌‌ యువర్ ఫిల్మ్

ఆర్జీవీ న్యూ కాన్సెప్ట్‌‌ యువర్ ఫిల్మ్

కాంట్రవర్సీలకు కేరాఫ్‌‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇకపై వాటి జోలికి పోనని చెప్పారు. అలాగే పొలిటికల్ బ్యాక్‌‌డ్రాప్‌‌  సినిమాలకు, పాలిటిక్స్‌‌కు కూడా దూరంగా ఉంటానని అన్నారు. ‘యువర్ ఫిల్మ్’ అనే కొత్త కాన్సెప్ట్‌‌ను పరిచయం చేస్తూ వర్మ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కొత్త టాలెంట్‌‌ను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా. 

 ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలని, సినిమా మేకింగ్‌‌లో కూడా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నా.  ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ సహా టెక్నీషియన్స్‌‌ను ఆర్జీవీ వెబ్‌‌సైట్ ద్వారా ఓటింగ్ పద్ధతిలో,  ప్రజలే ఎన్నుకుని, అందులో ముందంజలో ఉన్న వారితో నిర్మాతగా ఆరు నెలల్లో సినిమా తీసి రిలీజ్ చేస్తా’ అని చెప్పారు. 

 ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం..  అలాగే  ప్రేక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా అని,  భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారితో సినిమాలు నిర్మిస్తానని వర్మ అన్నారు.