లోక్‌‌‌‌ భవన్‌‌‌‌ లో రామ్‌‌‌‌ నాథ్ కోవింద్..గవర్నర్‌‌‌‌‌‌‌‌ కు తన ఆత్మకథ పుస్తకాన్ని బహూకరించిన మాజీ రాష్ట్రపతి

లోక్‌‌‌‌ భవన్‌‌‌‌ లో రామ్‌‌‌‌ నాథ్ కోవింద్..గవర్నర్‌‌‌‌‌‌‌‌ కు తన ఆత్మకథ పుస్తకాన్ని బహూకరించిన మాజీ రాష్ట్రపతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌ లోక్‌‌‌‌భవన్‌‌‌‌లో బస చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా ఆయనకు స్వాగతం పలికారు. 

ఈ భేటీలో భాగంగా రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌.. తన జీవిత విశేషాలు, పోరాటాలు పొందుపరిచిన ‘ట్రయంఫ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది ఇండియన్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌: మై లైఫ్‌‌‌‌, మై స్ట్రగుల్స్‌‌‌‌’ ఆత్మకథ పుస్తకాన్ని గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లాకు బహూకరించారు. అనంతరం ఇరువురు కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌‌‌‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.