RAPO23: దర్శకుడిగా మారిన రామ్.. సైఫై థ్రిల్లర్ జానర్లో సినిమా అనౌన్స్..

RAPO23: దర్శకుడిగా మారిన రామ్.. సైఫై థ్రిల్లర్ జానర్లో సినిమా అనౌన్స్..

టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని వరుస పరాజయాల తర్వాత కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. రామ్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరుడు కృష్ణ చైతన్య నిర్మాతగా సొంత బ్యానర్‌పై ఓ సైఫై యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నాడు. ఇవాళ మే15న రామ్ బర్త్ డే సందర్భంగా #RAPO23 ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్కి ట్రీట్ ఇచ్చారు. బలమైన కంటెంట్‌తో సినిమా తెరకెక్కనున్న సంకేతాలు పోస్టర్‌లో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో "వీరా" అనే పాత్రను పరిచయం చేస్తూ, ఇది ఒక ‘ఒంటరి తోడేలు కథ’అనే ట్యాగ్‌లైన్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అందుకు తగ్గట్టుగానే లెదర్‌ జాకెట్‌తో వెనకవైపు నిలబడి, వెరైటీ స్టైల్ తో ఉన్న జుట్టు.. ఇలా రామ్ లుక్‌ స్టైలిష్‌గా ఉంది. మొత్తానికి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు రామ్ స్వయంగా కథ రాసి డైరెక్ట్ చేస్తుండం విశేషం.

అభిమానుల ప్రేమ, ఆశీస్సులతో ఓ ఉత్కంఠభరిత ప్రయాణం ప్రారంభమవుతోందని చిత్రబృందం తెలిపింది. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ వద్ద పనిచేసిన ఓ యువ దర్శకుడితో మరో యాక్షన్ థ్రిల్లర్‌కూ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ALSO READ : : కీలక నిర్ణయం తీసుకున్న ఫిల్మ్ ఛాంబర్..