మళ్ళీ ఇస్మార్ట్ అవతారంలో రామ్.. వీడియో వైరల్

మళ్ళీ ఇస్మార్ట్ అవతారంలో రామ్.. వీడియో వైరల్

ఉస్తాద్ హీరో రామ్(Usthad Ram) మల్లి ఇస్మార్ట్ లుక్ లోకి మారిపోయారు . మొన్నటివరకు.. స్కంద(Skanda) సినిమా కోసం మాస్ లుక్ లో కనిపించిన రామ్.. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్(Ismart shankar) గా రగుడ్ లుక్ లోకి మారి పోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక ఇటీవలే రామ్, పూరి కాంబోలో డబుల్ ఇస్మార్ట్(Double ismart) పేరుతో ఒక మూవీ మొదలైన సంగతి తెలిసిందే. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు ఇది సీక్వెల్. అయితే ఈ సినిమా కోసం మరోసారి రామ్ మాసీ అండ్ రగుడ్ లుక్ లోకి మారిపోయారు. మరోసారి పక్కా తెలంగాణ యాసలో ప్రేక్షకులను మేపించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం రామ్ మేకోవర్ కు సంబంధించిన వీడియో ను పూరి జగన్నాధ్(Puri Jagannadh) తాజాగా రిలీజ్ చేశారు.

మొన్నటివరకు స్కంద సినిమా కోసం మాస్ లుక్ లో కనిపించిన రామ్.. మళ్ళీ ఇస్మార్ట్ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ లుక్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా.. 2024 ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాలా సూపర్ సక్సెస్ అవుతుందా? లైగర్ ఫ్లాప్ తో ఉన్న పూరికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.