గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ డైరెక్షన్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘రామబాణం’. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మే 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. గోపీచంద్ మాట్లాడుతూ ‘లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత శ్రీవాస్‌తో కలిసి చేసిన సినిమా ఇది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. డింపుల్ చాలా బాగా నటించింది. మిక్కీ జే మేయర్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నాడు.
‘హ్యాట్రిక్ కాంబినేషన్ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది డింపుల్. దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ‘ఎంటర్‌టైన్మెంట్, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా కుదిరిన సినిమా ‘రామబాణం’. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా వుంటాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్ అవుతాయి. ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీస్‌కు కనెక్ట్ అవుతాయి’ అన్నాడు. వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ ‘ఈ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. గోపీచంద్ యాక్షన్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘రామబాణం’ ఒక పండగలా వుంటుంది’ అని చెప్పారు.