పేద విద్యార్థుల చదువుల కోసం చేయూతనందిస్తాం: రామచంద్రారావు

పేద విద్యార్థుల చదువుల కోసం చేయూతనందిస్తాం: రామచంద్రారావు

తెలంగాణలోని  ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణుల  విద్యార్థుల చదువుల  కోసం చేయుతనందిస్తామని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు.  తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో  సెప్టెంబర్ 3న సనత్ నగర్ లోని సెవెన్ టెంపుల్ ఆలయంలో మీటింగ్ నిర్వహించారు.  

ఈ సందర్భంగా 80 మంది విద్యార్థులకు 110 లాప్టాప్ లు, 10 లక్షల రూపాయల స్కాలర్ షిప్స్ అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్రరావు  మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో  ఆర్థికంగా  వెనుకబడిన బ్రాహ్మణుల కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. 

అగ్రకులాల్లో వెనుకబడి ఉన్న వారి కోసం 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో  తెలంగాణ బ్రాహ్మణ సమైక్య సంఘం అధ్యక్షులు వెల్లాల రామ్మోహన్,  త్రిదండి దేవనాథ రామానుజ  జీయర్ స్వామి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, మాజీ రాజ్యసభ సభ్యులు వేణుగోపాల చారి పాల్గొన్నారు