త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి

 త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది  :   వివేక్ వెంకటస్వామి

త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళితే..కేసీఆర్ ఇంతవరకు స్పందించడం లేదన్నారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులకు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లపేరుతో వచ్చిన నిధులపై ఈడీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరలకు.. హైదరాబాద్ లోని జనసమితి కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విందు ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ విందులో పాల్గన్న వివేక్.. ముస్లిం  సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.