Ramadan timings : రంజాన్ నెల ప్రారంభం.. ఉపవాసం ఎప్పటినుంచంటే

 Ramadan timings : రంజాన్ నెల ప్రారంభం.. ఉపవాసం ఎప్పటినుంచంటే

ముస్లింల పవిత్ర నెల రంజాన్ వచ్చేసింది. రేపట్నించి (మార్చి 23)  ఉపపాసాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 న నెలవంక కనిపించక పోవడంతో 24 తేదీ శుక్రవారం నుంచి రంజాన్ నెలను ప్రారంభించనున్నారు. ప్రత్యేక నమాజు తరావీ ప్రార్థనలు గురువారం రాత్రి (మార్చి 23) ప్రారంభమవుతాయి. శుక్రవారం ఉదయం 4:50 కల్లా సహరి పూర్తి చేయాలని, సాయంత్రం 6:33 తర్వాత ఉపవాస దీక్ష విరమించుకోవాలని ఆస్థాన ఏ గౌసియా పీఠాధిపతి, ప్రభుత్వ ఖాజీ సయ్యద్‌ షా గౌస్‌పీరా ఖాద్రి తెలిపారు. 

రంజాన్‌ మాసం సౌదీ అరేబియాలో ముందే ప్రారంభమవుతుంది. బుధవారం రాత్రి నెలవంక కనిపించడంతో మన దేశం కంటే ఒక రోజు ముందే అక్కడ రంజాన్‌ మాసం ప్రారంభం అవుతుంది. గురువారం నుంచే సౌదీలో ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయని మతపెద్దలు తెలిపారు.