అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. 350 ఓట్లు, 6 వార్డులు కలిగిన పంచాయితీలో అందరూ ఆదివాసీలే కావటంతో వేరే రాజకీయ పార్టీలకు ఈ పంచాయతీలో అవకాశం లేకుండా పోయింది.
కనీసం ఒక్క పార్టీ కూడా అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో, పార్టీలకు చెందిన వారు ఎవరు కూడా లేకపోవడంతో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మడకం నాగేశ్వరరావు తో పాటు మరో ఆరుగురు వార్డు సభ్యులు సోమవారం నామినేషన్లను దాఖలు చేశారు. గ్రామమంతా తీర్మానం చేసి సభ్యులను ఎన్నుకున్నారు. కాగా ఎలక్షన్స్ ఆఫీసర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సిఉంది.
