రామాయణం, భారతం కల్పితాలు​ : తాతా మధు సూదన్​

రామాయణం, భారతం కల్పితాలు​ : తాతా మధు సూదన్​

హైదరాబాద్, వెలుగు : పిల్లలు కల్పిత కథలైన రామాయణం, మహాభారతం చదువుతున్నారని బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాస్తవ కథ అయిన తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆయన కోరారు. ఆదివారం శాసన మండలిలో జరిగిన ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి’ అంశంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, పోరాటం, అభివృద్ధి అంశాలు భవిష్యత్తు తరాలకు తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని ఆయన సూచించారు.