
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్ రావు శనివారం (జూలై 5) బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను రామచందర్ రావుకు కిషన్ రెడ్డి అప్పగించారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడికి బీజేపీ శ్రేణులు అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి వరకు రావడం బీజేపీలోనే సాధ్యమని.. ఇందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు.
Also Read : గర్వించదగ్గ క్షణం..ట్రినిడాడ్, టొబాకో పార్లమెంట్లో..మన జనగణమన గీతం ఆలపించారు
రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి స్పష్టమైన కార్యచరణతో ముందుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతామన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసి ఇష్టమొచ్చినట్లు హామీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు ఉసురు తగులుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా క కొరతపై దుష్ప్రాచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన యూరియాను రాష్ట్ర పాలకులు తినేశారా అని ఆరోపించారు. మోడీ, బీజేపీని తిట్టడమే కాంగ్రెస్ సామాజిన న్యాయ సభ ఉద్దేశమా అని ప్రశ్నించారు.