
140 కోట్ల భారతీయులు గర్వించదగ్గ క్షణం..కరేబియన్ చట్టసభలసభలో అరుదైన గౌరవం..శుక్రవారం(జూలై4) ట్రినిడాడ్ ,టొబాగో పార్లమెంట్‌లో మన జాతీయ గీతం జనగణమన ఆలపించారు.
ట్రినిడాడ్ ,టొబాగో పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించే ముందు మన నేషనల్ ఆంథెమ్ ను వినిపించారు. మరోవైపు కరేబియన్ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించారు.
#WATCH | Port of Spain | PM Modi to address the parliament of Trinidad and Tobago, shortly.
— ANI (@ANI) July 4, 2025
(Source - DD) pic.twitter.com/u1RARA1D8x
కరేబియన్ పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ఉగ్రవాదం మానవత్వానికి శత్రువు అని అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం లేదా స్థలం లేకుండా చేసేందుకు ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ముందన్నారు ప్రధాని మోదీ.
మా అభివృద్ధి భాగస్వామ్యాలు డిమాండ్ ఆధారితమైనవి, గౌరవప్రదమైనవి ,షరతులు లేనివి" అని ఆయన గ్లోబల్ సౌత్ పట్ల భారత్ విధానాన్ని స్పష్టం చేశారు మోదీ. చైనాతో పోలిస్తే భారత్ విధానం విభిన్నమైనది అన్నారు.
భౌగోళిక రాజకీయ గడ్డు పరిస్థితులను పరిశీలిస్తూ.. రాజకీయాలు, అధికారం స్వభావంలో మార్పులుతోపాటు, ప్రపంచవ్యాప్తంగా విభజనలు, వివాదాలు, అసమానతలపై ప్రధాని మోదీ ఈ సందర్బంగా మాట్లాడారు.
►ALSO READ | మహా పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్
స్వేచ్ఛా వాణిజ్యం ఒత్తిడిలో ఉందన్న మోదీ.. ప్రపంచం వాతావరణ మార్పు, ఆహారం, ఆరోగ్యం ,ఇంధన భద్రత వంటి సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారాయన. పాత అంతర్జాతీయ సంస్థలు శాంతి ,పురోగతిని అందించేందుకు చాలా కష్టపడుతున్నాయి. అదే సమయంలో గ్లోబల్ సౌత్ పెరుగుతోంది. వారు కొత్త ,న్యాయమైన ప్రపచాన్ని చూడాలనుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.
కరేబియన్ దేశంలో రెండు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం అర్జెంటీనాలో అడుగుపెట్టారు.