మహా పాలిటిక్స్‎లో ఇంట్రెస్టింగ్ సీన్.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్

మహా పాలిటిక్స్‎లో ఇంట్రెస్టింగ్ సీన్.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత థాక్రే బ్రదర్స్ ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే ఒకే వేదికను పంచుకున్నారు. కాగా, జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవా చీఫ్ రాజ్ ఠాక్రే ఆందోనళనకు పిలుపునిచ్చారు. 

2025, జూలై 5న ముంబైలోని వర్లీలో సంయుక్తంగా నిరసన ర్యాలీ చేపట్టారు. రెండు దశాబ్ధాల వైరాన్ని పక్కన పెట్టి ఈ ర్యాలీలో ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే కలిసి పాల్గొన్నారు. థాక్రే సోదరులు కలవడంతో బాల్ థాక్రే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు, ముంబై మున్సిపల్ ఎన్నికలకు ముందు థాక్రే బ్రదర్స్ ఒక్కటవడంతో మహా పాలిటిక్స్‎లో సమీకరణాలు మారుతున్నాయి.

►ALSO READ | ఏడాదిలో 20 వేల కోట్లు సంపాదించిన జేన్ స్ట్రీట్ : స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద ప్రాఫిట్ డీల్..!

ఈ సందర్భంగా రాజ్ థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాజకీయాల కంటే గొప్పదన్నారు. 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇద్దరిని ఒకేచోట కలిపి బాల్ థాక్రే కూడా చేయలేని పని దేవేంద్ర ఫడ్నవీస్ చేశాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనకు హిందీ అంటే ఎలాంటి వ్యతిరేకత లేదని.. ఏ భాష కూడా చెడ్డది కాదని.. ఒక భాషను నిర్మించడానికి చాలా కృషి అవసరమన్నారు.

మరాఠా పాలకులు చాలా రాష్ట్రాలను పరిపాలించారు, కానీ ఆ ప్రాంతాలపై ఎప్పుడూ మరాఠీ బాషను బలవంతం చేయలేదని గుర్తు చేశారు. మాపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు. మేము దానిని వ్యతిరేకించకపోతే వారు ముంబైని కూడా మహారాష్ట్ర నుంచి వేరు చేస్తారని హాట్ కామెంట్స్ చేశారు. మరాఠీ భాష, మరాఠీల సమస్యలపై పోరాటంలో ఎటువంటి రాజీ ఉండదని తేల్చి చెప్పారు.