వర్మ రాజకీయం వ్యాపారం..వైసీపీ కోటాలో పాగా..

వర్మ రాజకీయం వ్యాపారం..వైసీపీ కోటాలో పాగా..

చంద్రముఖి సినిమా గుర్తుందా...అందులో ఓ డైలాగ్ మస్తు ఫేమస్ అయింది. గంగ (జ్యోతిక) చంద్రముఖిలా మారుతూ..మారుతూ ఉంటుంది. ఆ తర్వాత గంగ.. పూర్తిగా చంద్రముఖిలా మారిపోతుంది. సో ఇప్పుడు ఇదే డైలాగ్ ..వివాదాల వర్మ..టాలీవుడ్ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు సరిపోతుంది. మొన్నటి వరకు వరుసగా సినిమాలు చేస్తూ.. ..అడపా దడపా ఏపీ రాజకీయాలు, ఇతర అంశాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ  ట్వీట్లు చేస్తుండేవారు వర్మ.  అయితే ఇప్పుడు వర్మ పూర్తిగా పొలిటికల్ భజన చేస్తున్నారు. అందుకే పూర్తిగా పొలిటీషియన్గా మారిపోయిన  రామ్ గోపాల్ వర్మను చూస్తున్న  ప్రజలు..చంద్రముఖి డైలాగ్ను గుర్తు చేసుకుంటున్నారు. 

ట్వీట్లతో పవన్, బాబులపై తిట్లు..

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్గా రామ్ గోపాల్ వర్మ వరసగా విరుకుపడుతున్నారు. ఓ వైపు వ్యూహం అంటూ సీఎం జగన్ పై సినిమా తీస్తూనే....మరోవైపు నిజం పేరుతో యూట్యూబ్ వీడియోలను ఏపీ రాజకీయాలపై సంధిస్తున్నారు. దీనికి తోడు  ట్విట్టర్లో  ఓపెన్ అయిపోయి...చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా వర్మ...వైసీపీ వర్మగా మారిపోయారు. పవ సైకోనాలజీ అంటూ ఎపిసోడ్స్ షూట్ చేయటంతోపాటు.... పవన్ కల్యాణ్  స్టైల్స్తో ఉన్న పోస్టర్లకు పోటీగా తన మార్ఫింగ్ ఫొటోలను రిలీజ్ చేస్తున్నారు. అయితే నిన్నటి వరకువపన్ కల్యాణ్ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన వర్మ.... ఇప్పుడు  ట్విట్టర్ లో చంద్రబాబు, నారా లోకేష్ను డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. వాళ్ల ట్విట్లను రీ ట్విట్  చేస్తూ..... తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.

వైసీపీ వర్గంలో వర్మ...

అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వర్మ తన పోస్టులు, రాతలు, ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. దీంతో జనం వర్మ..వైసీపీ వర్మగా మారిపోయారని క్లారిటీకి వచ్చారు. పవన్ కల్యాణ్ అడుగు తీసి అడుగు వేసినా....ఆయన  ఏం మాట్లాడినా..వర్మ వెంటనే ట్విట్టర్లో  కౌంటర్లు వేస్తున్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వర్మ నేరుగా కౌంటర్ ఇచ్చారు. దీంతో వర్మ వైసీపీ గ్యాంగ్ లో చేరిపోయారని...ఆయన 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా పని చేస్తున్నట్లు ఏపీ జనం అంచనాకు వచ్చేశారు. 
దీంతో పాటు.. వ్యూహం పార్ట్ 1, పార్ట్ 2 సినిమాల ద్వారా కుట్రలకీ, ఆలోచనలకీ మధ్య తేడా అనే క్యాప్షన్తో సీఎం జగన్ కు అనుకూలంగా.. చంద్రబాబు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ.. తాను వైసీపీ ప్యాకేజీలో ఉన్నట్లు టీడీపీ, జనసేన పార్టీలకు చెబుతున్నారు. 

మొత్తానికి రాంగోపాల్ వర్మ పూర్తిగా మారిపోయాడు.  తన ట్విట్టర్ హ్యాండిల్ను ఏపీ పొలిటికల్ గేమ్ కు వాడేసుకుంటున్నారు.  వర్మ తన సినిమాల కంటే పొలిటికల్ యాంగిల్ కే ప్రాధాన్యత ఇస్తూ.... 2024 ఎన్నికల వరకు గిట్టుబాటు అయ్యే వ్యాపారాన్ని వెతుక్కున్నారని జనం అనుకుంటున్నారు.