ఈ రిజల్ట్ను ముందే ఊహించాం.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ వీక్ కలెక్షన్లపై రామ్

ఈ రిజల్ట్ను ముందే ఊహించాం.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ వీక్ కలెక్షన్లపై రామ్

రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఉపేంద్ర కీలక పాత్రలో   పి.మహేష్ బాబు రూపొందించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు.  నవంబర్ 27న  విడుదలైన ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన  థ్యాంక్స్ మీట్‌‌లో  రామ్ మాట్లాడుతూ ‘చాలా ఏళ్ల తర్వాత నా సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

ఫస్ట్ వీక్  స్లోగా ఉన్నా నెమ్మదిగా పికప్ అవుతుందని మేం ముందే ఊహించాం. లాంగ్ రన్ ఉంటుందని భావిస్తున్నాం.  ఈ సినిమాతో నేను పర్సనల్‌‌గా కనెక్ట్ అయ్యాను.  ఫ్యాన్ ఎమోషన్‌‌తో వచ్చిన ఈ చిత్రానికి అందరూ కనెక్ట్ అవుతున్నారు. వివేక్ మెర్విన్ చాలా ఫ్రెష్ మ్యూజిక్‌‌ను ఇచ్చారు. ఎంటర్‌‌‌‌టైన్ చేయడమే కాదు.. ఇన్‌‌స్పైర్ చేసేలా ఈ సినిమా ఉందని కొందరు చెప్పడం హార్ట్ టచ్చింగ్‌‌గా అనిపించింది. ఇలాంటి హానెస్ట్  మూవీస్ మరిన్ని రావాలని కోరుకుంటున్నా’ అన్ని అన్నాడు.

భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ‘మహాలక్ష్మి పాత్ర పోషించడం గర్వంగా ఉంది. నా క్యారెక్టర్‌‌‌‌కు మంచి అప్లాజ్ దక్కడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది.  డైరెక్టర్ పి మహేష్ బాబు మాట్లాడుతూ ‘ఈ మూవీకొస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషంగా ఉంది. మరిన్ని మ్యాజిక్స్ క్రియేట్ చేయాలని భావిస్తున్నా’ అని చెప్పాడు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ  బాగుందని చెబుతున్నారు. కానీ కలెక్షన్స్ విషయంలో కొంచెం తక్కువే ఉన్నాయి.

నవంబర్ ఎండ్,  అన్ సీజన్ కావడం, నెక్స్ట్ వీక్ పెద్ద సినిమా ఉండటంలాంటి కారణాలతో కలెక్షన్స్ తగ్గినా.. లాంగ్ రన్ ఉంటుందని ముందు నుంచీ భావించాం. సినిమా బాగున్నా.. కలెక్షన్స్ తక్కువ ఉన్నాయని అందరూ చెబుతుండటంతో  దీనికోసం సెకండ్ ఫేజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇలాంటి మంచి కథలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.