
ఢిల్లీ : మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ ప్రయత్నం , లోటుపాట్లపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సమగ్ర నివేదికను సమర్పించానని సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నిక ఇంఛార్జిగా తన దృష్టికి వచ్చిన అంశాలతో ఈ నివేదికను రూపొందించానని తెలిపారు.
బై పోల్ లో కాంగ్రెస్ బాగా పని చేసిందని ఆయన కితాబిచ్చారు. మైక్రో మేనేజ్మెంట్ చక్కగా చేశామన్నారు. ఇంఛార్జీల రిపోర్ట్ ల ఆధారంగానే పార్టీలో పదవులు ఇస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఖర్గేతో జరిగిన భేటీలో చర్చించినట్లు దామోదర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చ జరిగిందన్నారు.