రాములో రాములా… పండగ తెచ్చారురో!

రాములో రాములా… పండగ తెచ్చారురో!

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌‌ డైరెక్షన్‌‌లో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌‌ నిర్మిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీలోని ‘సామజవరగమన’ పాట ఆల్రెడీ సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు ‘రాములో రాములా’ అనే పాట వచ్చి, కాసేపటికే వైరల్ అయి పోయింది. తమన్‌‌ స్వరాలకు కాసర్ల శ్యామ్ రాసిన పదాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

అనురాగ్‌‌ కులకర్ణి, మంగ్లీ పాడిన విధానం బాగుంది.  శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పుల్ని బన్నీ స్టైల్‌‌గా వేస్తుంటే చూడటానికి  చక్కగా ఉంది. పాటలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, సుశాంత్‌‌లతో పాటు మెయిన్‌‌ ఆర్టిస్టులందరూ కనిపించడంతో నిజంగానే పండుగలా ఉంది. ఇది పండుగనాడు విడుదల చేయాల్సిన పాటే అనిపించింది.   మొదట మంచి మెలొడీతో మురిపించి, ఇప్పుడు  మాస్‌‌ సాంగ్‌‌తో మెస్మరైజ్ చేశారు.  ముందు ముందు ఇంకెలాంటి పాటలు వినిపిస్తారో.