త్వరలోనే తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అభ్యర్థుల విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించి అధిష్టానానికి కొన్ని పేర్లను పంపగా.. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి అభ్యర్థిగా జి. చిన్నారెడ్డి పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. ఈ ఇద్దరి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఖరారు చేశారని.. పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ తెలిపారు.
