రూ.లక్ష కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినం : మంత్రి కోమటి రెడ్డి

రూ.లక్ష కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినం : మంత్రి కోమటి రెడ్డి
  • ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆర్​అండ్​ బీ శాఖ పరిధిలో రూ.లక్ష కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్​లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రి మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని, రోడ్లు, భవనాల నిర్మాణంలో నాణ్యతకు టాప్​ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు.

 ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బిల్డర్స్‌‌కు పిలుపునిచ్చారు. కనెక్టివిటీ బాగుంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయన్నారు. అందుకే ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్ల విలువైన పనులను చేపట్టిందని మంత్రి తెలిపారు.