
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
పండగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్న సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపడిన ప్రేమకథ ఇది. ఈ సినిమాలో వైష్ణవ్ అక్కడక్కడా పవన్ ను ఇమిటేట్ చేశాడనే విషయం అర్థమవుతోంది. పవన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయనుండటం విశేషం. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.