జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ బడుల్లో 50 శాతం రాయితీ

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ బడుల్లో 50 శాతం రాయితీ
  • రంగారెడ్డి డీఈవో ఉత్తర్వులు 

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేట్​పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని టీయూడబ్ల్యూజే జిల్లా శాఖ చేసిన విజ్ఞప్తికి డీఈవో వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించారు. శుక్రవారం సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాపీని సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీమ్ పాషాకు అందజేశారు. 

ఈ ఆదేశాలు అన్ని పాఠశాలల్లో వర్తించేలా చూడాలని ఎంఈవోలకు సూచిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు మారాటి రవి, నాయకులు కరుణాకర్, భాస్కర్, భార్గవ్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.