తప్పకుండా వర్షాలు కురుస్తాయి: భవిష్యవాణి

తప్పకుండా వర్షాలు కురుస్తాయి: భవిష్యవాణి

రాష్ట్రంలో తప్పకుండా మంచి వర్షాలు కురుస్తాయని.. భవిష్యవాణిలో చెప్పారు స్వర్ణలత. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత… ప్రజలందరినీ సంతోషంగా ఉంచుతానన్నారు. గంగాదేవికి ఘనంగా జలాలతో అభిషేకించి బోనం తీయాలన్నారు. జాతర ఏర్పాట్లు బాగున్నాయని…తాను సంతృప్తి చెందానన్నారు. ప్రజలంతా సంతోషంగా బోనాలు సమర్పించుకున్నారని తెలిపారు. ప్రతీ ఏడు తప్పకుండా బోనాలు తీయాలని…తాను కూడా ప్రజలను చల్లంగా చూస్తానంది. 5 వారాల పాటు సాకలు, పప్పుబెల్లం తో తనను పూజించాలని… మీ కోరికలన్నీ తీరుతాయని స్వర్ణలత చెప్పారు.