అల్లంత దూరాన రంగారెడ్డి కలెక్టరేట్

అల్లంత దూరాన రంగారెడ్డి కలెక్టరేట్

ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు లేదా ఏదైనా పనిమీద రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​కు వెళ్లి రావాలంటే ట్రాన్స్​పోర్టుకు రూ. వెయ్యి దాకా ఖర్చవుతోందని జిల్లా వాసులు వాపోతున్నారు. ఏడాదిన్నర కిందటి వరకు రంగారెడ్డి కలెక్టరేట్​ను గతేడాది ఆగస్టు 25న ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్​లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పేరుతో కొత్తగా నిర్మించిన బిల్డింగ్​కు షిఫ్ట్​చేశారు.  

ఇది ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌ రావిర్యాల ఎగ్జిట్​కు 3.2 కి.మీ, బొంగళూర్ గేట్– నాగార్జునసాగర్ రోడ్‌‌‌‌‌‌‌‌ నుంచి11.4 కి.మీ, శ్రీశైలం హైవే – తుక్కుగూడ నుంచి 9.2 కి.మీ దూరంలో ఉంది. కలెక్టరేట్​కు ఎటు నుంచి రావాలన్నా సొంత వెహికల్ ​లేదా కిరాయి వెహికల్​ఉండాల్సిందే. కలెక్టరేట్ ​కేంద్రంగా మొత్తం 33 డిపార్ట్​మెంట్లలో దాదాపు 500 మంది అధికారులు పనిచేస్తుండగా, వారి కోసం జూబ్లీ బస్ట్​స్టేషన్, దిల్​సుఖ్​నగర్, మియాపూర్, లింగంపల్లి, మెహిదీపట్నం, చార్మినార్ నుంచి మొత్తం 7 ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు.

కలెక్టరేట్​కు వచ్చే జనం ఆ బస్సులు ఎక్కాలంటే ఉదయం 10.30 గంటల లోపు సదరు రూట్లలో వెయిట్​ చేయాలి. తిరిగి వెళ్లాలంటే సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉండాలి. ఈ మధ్యలో ఎలాంటి బస్సులు ఉండవు. క్యాబ్, ఆటోలో వెళ్లి రావాలంటే 500 నుంచి రూ. వెయ్యి ఖర్చవుతోంది. చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ బస్ ​సర్వీసులను పెంచాలని, గంట గంటకూ బస్సులు నడపాలని జనం రిక్వెస్ట్​ చేస్తున్నా స్పందన లేదు.