![బాలికకు వేధింపులు.. యువకుడికి రెండేళ్ల జైలు](https://static.v6velugu.com/uploads/2025/01/rangareddy-district-court-sentences-accused-who-molested-girl-with-a-love-name-to-two-years-in-jail_zIR2oY150S.jpg)
ఎల్బీనగర్, వెలుగు: ప్రేమపేరుతో బాలికను వేధించి, ఆమెపై లైంగిక దాడికి యత్నించిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ కేశవపట్నంకు చెందిన నవీన్ అలియాస్ గోపీ నాగోల్ జైపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. 2019లో నగరానికి చెందిన ఓ బాలికను ప్రేమపేరుతో వేధించాడు. అంతటితో ఆగకుండా ఆమె ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి యత్నించాడు.
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి సరైన ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేశారు. దీంతో విచారించిన కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.