రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇమాంగూడలోని తాజా టిఫిన్స్‌లో టిఫిన్‌లో ఈగలు వచ్చాయి. సోమవారం ఓ కస్టమర్ టిఫిన్ ఆర్డర్ చేయగా సాంబార్లో ఈగ కనిపించింది. అంతేగాకుండా మరొకరికి ఇచ్చిన స్వీట్ లోనూ ఈగ దర్శనమివ్వడంతో నిర్వాహకులను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మున్సిపల్ కమిషనర్ వాణి అక్కడికి చేరుకుని కిచెన్, ఆహార పదార్థాలను పరిశీలించారు. తాజా హోటల్ నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా విధించారు. పక్కనే ఉన్న పిస్తా హౌస్ లోనూ తనిఖీలు నిర్వహించి నీట్నెస్ లేకపోవడం, ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నందున రూ.10 వేలు ఫైన్ వేశారు.
