
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్ పవర్ లిఫ్టింగ్ టోర్నీలో రంగారెడ్డి జిల్లా.. మెన్స్ టీమ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. సీనియర్ పవర్ లిఫ్టర్ ప్రకాష్ బిడ్లాండ్ జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో రంగారెడ్డి మెన్స్ ఓవరాల్ చాంపియన్‌గా, విమెన్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. సబ్ జూనియర్, జూనియర్ లో కలిపి రంగారెడ్డి కి 6 గోల్డ్, 7 సిల్వర్, 3 బ్రాంజ్ మెడల్స్ లభించాయి. విమెన్స్‌లో ఒక గోల్డ్, 2 సిల్వర్, 3 బ్రాంజ్ దక్కాయి. తెలంగాణ పవర్ లిఫ్టింగ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అనిల్, సెక్రటరీ గోపాల్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.