బైక్ ను ఢీ కొట్టిన మిక్సర్ లారీ.. ఒకరు మృతి

బైక్ ను ఢీ కొట్టిన మిక్సర్ లారీ.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి చౌరస్తా దగ్గర రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మిక్సర్ లారీ రాంగ్ రూట్లో  వెళ్తూ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న ఫారూఖ్ స్పాట్ లో చనిపోయాడు. ఫారూఖ్ ఉత్తర ప్రదేశ్ చెందిన వ్యక్తి..అతను కట్టింగ్ షాప్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే మిక్సర్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఫారూఖ్ డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. త్వరలోనే డ్రైవర్ ని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తామని మైలార్ దేవ్ పల్లి SI తెలిపారు.

see more news

రూ.100కోట్లు ఇయ్యకపోతే దీక్షలకు దిగుతం

తమ్ముడు చనిపోయాడని తెలిసి గుండెపోటుతో అన్న మృతి