‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాలో ఆర్గానిక్ కామెడీ ఉంటుందని, ప్రేక్షకులు ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేస్తారని చిత్ర దర్శకుడు మురళీ మనోహర్ చెప్పాడు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. కొత్త తరహా సహజత్వంతో కూడిన కామెడీ ఆద్యంతం నవ్వించింది.
డిసెంబర్ 19న సినిమా విడుదలవుతున్న సందర్భంగా డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు పూర్ణ కథను అందించారు. మిగతా రైటర్స్, నేను స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాం. ఈ సినిమాకు ఫస్ట్ అనుకున్న టైటిల్ పరమపదసోపానం. దీనికి అంతగా రీచ్ ఉండదని.. ‘గుర్రం పాపిరెడ్డి’ అని పెట్టాం.
ఇందులో నరేష్ అగస్త్య క్యారెక్టర్ పేరు అది. తెలివైనవారు తెలివితక్కువ పనిచేసినా, తెలివితక్కువ వారు తెలివైన పనిచేసినా వారి జీవితాలు ఎలా మారుతాయి అనేది హ్యూమరస్‌గా రూపొందించాం. ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత పిచ్చితనం ఉంటుంది. ఆ స్టుపిడిటీ నుంచి పుట్టే సహజమైన వినోదాన్ని తెరపైకి తీసుకొచ్చాం.
►ALSO READ | అఖండ-2 సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
నరేష్ అగస్త్య గుర్రం పాపిరెడ్డి పాత్రలో సహజంగా నటించాడు. ఫరియా అబ్దుల్లా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. అలాగే ఈ చిత్రంలో ఒక పాట కూడా తనే రాసి పాడి కొరియోగ్రఫీ చేసింది. బ్రహ్మానందం గారు కీ రోల్‌లో నటించారు. చాలా రోజుల తర్వాత ఆయన చేసిన ఫుల్ లెంగ్త్ సినిమా ఇది. మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌కు యోగి బాబుని తీసుకున్నాం. అలాగే రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, జాన్ విజయ్ పాత్రలు కథలో భాగంగానే ఉంటాయి’ అని చెప్పాడు.

