ఇండోర్/ముంబై: రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ తొలిసారి సెమీఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌తో సోమవారం ముగిసిన క్వార్టఫైనల్లో జమ్మూ 56 రన్స్ తేడాతో విజయం సాధించింది. పేసర్ ఆకిబ్ నబీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు.
దాంతో 291 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎంపీ సెకండ్ ఇన్నింగ్స్‌లో 234 రన్స్‌కే కుప్పకూలింది. మరో క్వార్టర్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (130) సెంచరీతో సత్తా చాటడంతో కర్నాటక 4 వికెట్ల తేడాతో 42 సార్లు చాంపియన్ ముంబైని ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.
