మహారాష్ట్రలో వేగంగా టూరిజం విస్తరణ.. నాసిక్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ మధుమతి

మహారాష్ట్రలో వేగంగా టూరిజం విస్తరణ.. నాసిక్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ మధుమతి

ముషీరాబాద్, వెలుగు : మహారాష్ట్రలో టూరిజం అత్యంత వేగంగా విస్తరిస్తుందని ఆ రాష్ట్ర టూరిజం  శాఖ నాసిక్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ మధుమతి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అష్ట వినాయక్, జ్యోతిర్లింగాలు, పండరీపూర్, కొల్లాపూర్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి దక్షిణ భారత్ ​నుంచి పర్యటకులు పెరుగుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 8 నగరాల్లో నిర్వహిస్తున్న మహారాష్ట్ర టూరిజం ట్రావెల్ అండ్ రోడ్ షో సోమవారం రాత్రి సిటీలోని మారియట్ హోటల్​లో జరిగింది.

ఇందులో పాల్గొన్న మధుమతి మాట్లాడుతూ..  మహారాష్ట్ర అందించే ట్రావెల్ టూరిజం ల్యాండ్ స్కేప్, చారిత్రక వారసత్వం కట్టడాలు, బీచ్​లు, మతపరమైన చిహ్నాలు, హిల్ స్టేషన్లలో సాహస క్రీడలు, రుచికరమైన వంటకాలు సాంస్కృతిక ఉత్సవాలతో పర్యాటక ప్రదేశాలుగా మారాయన్నారు. ఇంటర్నేషనల్ గా మంచి గుర్తింపు దక్కిందన్నారు. మహా రోడ్ షో –2023 పేరుతో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. శామిన్ తదితరులు పాల్గొన్నారు.