మెడికవర్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్‌‌‌‌

మెడికవర్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్‌‌‌‌

కరీంనగర్ టౌన్, వెలుగు: సికింద్రాబాద్  మెడికవర్  హాస్పిటల్ లో కరీంనగర్ కు  చెందిన విజయ్ కుమార్(32) మెదడుకు న్యూరో ఎండోస్కోపీ ఆపరేషన్  చేసి కొత్త జీవితం ప్రసాదించినట్లు డాక్టర్  శిఘాకొల్లి రమేశ్​ తెలిపారు. సిటీలోని ఓ హోటల్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి రమేశ్​ తీవ్ర తలనొప్పి, అతి నిద్ర ఇతర మెదడు సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. పలుమార్లు సర్జరీలు చేయించుకున్నా ఉపశమనం పొందలేదని తెలిపారు. హైడ్రోసెఫాలస్  సమస్య ఉన్నట్లు నిర్ధారించి, న్యూరో ఎండోస్కోపీ విధానంతో మినిమల్లీ ఇన్వాసివ్  సర్జరీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పేషెంట్  ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.