అడవికి ‘రాజ’సం.. కాగజ్‌‌నగర్ అటవీ ప్రాంతంలో కెమెరాలకు చిక్కిన పులుల అరుదైన దృశ్యాలు

అడవికి ‘రాజ’సం.. కాగజ్‌‌నగర్ అటవీ ప్రాంతంలో కెమెరాలకు చిక్కిన పులుల అరుదైన దృశ్యాలు

అడవికి రక్షక భటుడు పులి. పర్యావరణ సమతుల్యతను కాపాడే కీలక వన్యప్రాణి. అందుకే పులుల సంరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌నగర్ అటవీ డివిజన్ గత పదేళ్లుగా పులుల ఆవాసంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ నెల 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గత పదేళ్లలో కాగజ్‌‌నగర్ అటవీ ప్రాంతంలో కెమెరాలకు చిక్కిన పులుల అరుదైన దృశ్యాలను అటవీ శాఖ తాజాగా విడుదల చేసింది.

వీటిలో నీరు తాగుతున్న పెద్దపులి, సాసర్‌‌పిట్‌‌లో ఆడుకుంటున్న పులి పిల్లలు, కడంబా అడవిలో నాలుగు పిల్లలతో ఉన్న ఫాల్గుణ, తల్లి వెంట నడుస్తున్న పిల్లపులి, కలిసి సంచరిస్తున్న మూడు పులులు, వేటాడిన ఆహారంతో వెళ్తున్న పులి చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కాగజ్‌‌నగర్, వెలుగు