GT vs RR: ఐపీఎల్ 2026 క్లైమాక్స్ రేస్ ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈరోజు న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు ఫైనల్ బెర్త్ కోసం ఢీకొట్టబోతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గుజరాత్ టీమ్‌కు మెయిన్ వెపన్ ఎవరంటే.. స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్.
రషీద్ రోల్ క్రూషియల్:
ఈ సీజన్ అంతా టెస్ట్ మ్యాచ్ లెంగ్త్‌లు వేసే పేసర్లకే ఎక్కువగా హెల్ప్ అవుతున్నా.. రషీద్ మాత్రం 15 ఇన్నింగ్స్‌ల్లో 19 వికెట్లతో ఐపీఎల్ 2026 టాప్-10 వికెట్ టేకర్లలో నిలిచిన ఏకైక స్పిన్నర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన పిచ్ నంబర్ 4నే ఈరోజు మ్యాచ్‌కు కూడా వాడుతుండటంతో రషీద్ రోల్ చాలా క్రూషియల్ ఉండనుంది.
రాజస్థాన్కి రషీద్ అంటేనే వణుకు:
రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్‌పై రషీద్ ఖాన్‌కు అదిరిపోయే ట్రాక్ రికార్డ్ ఉంది. గత మ్యాచ్‌లోనే ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరాలను రషీద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతెందుకు.. ఈ సీజన్ మొత్తాన్ని శాసిస్తున్న 15 ఏళ్ల ఓపెనింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని కూడా ఏప్రిల్‌లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లోనే రషీద్ పెవిలియన్ కి పంపించాడు. రబడ, సిరాజ్‌లను దంచికొట్టిన సూర్యవంశీని అవుట్ చేయడానికి రషీద్ పక్కా స్కెచ్ వేశాడు. లెగ్‌సైడ్ బౌండరీ పెద్దగా ఉండటంతో.. అక్కడ గ్లెన్ ఫిలిప్స్‌ను ఫీల్డర్‌గా పెట్టి.. సూర్యవంశీకి షార్ట్ సైడ్ యాక్సెస్ లేకుండా పక్కా లెంగ్త్‌తో లెగ్‌బ్రేక్ వేసాడు.. దాంతో సూర్యవంశీ భారీ షాట్‌కు ట్రై చేసి డీప్ మిడ్‌వికెట్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు.
మిడిల్ ఓవర్లలో రషీద్ ఖానే కింగ్:
2025 సీజన్ రషీద్ ఖాన్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన సీజన్ (కేవలం 9 వికెట్లు).. బ్యాక్ సర్జరీ వల్ల లాస్ట్ సీజన్‌లో లెంగ్త్ సరిగ్గా వేయలేక ఇబ్బంది పడ్డాడు. కానీ ఈ సీజన్లో రషీద్ పాత ఫామ్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా మ్యాచ్‌ను డిసైడ్ చేసే మిడిల్ ఓవర్లలో (7 నుంచి 16 ఓవర్లు) రషీద్ ఖాన్ 17 వికెట్లతో ఈ సీజన్ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. రషీద్‌కు, ఆ లిస్టులో ఉన్న సెకండ్ బౌలర్‌కు మధ్య ఏకంగా 4 వికెట్ల గ్యాప్ ఉందంటేనే అతడు ఏ రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు.
గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంజూరీ తర్వాత హార్డ్ వర్క్ చేసి మైండ్ బ్లోయింగ్ గా కంబ్యాక్ ఇచ్చాడు.. ప్రెజర్ సిట్యుయేషన్స్ అంటే అతనికి చాలా ఇష్టం.. అతని స్కిల్స్ పై మాకు ఫుల్ ట్రస్ట్ ఉందని వెల్లడించాడు. ఎప్పుడూ సింపుల్ థింగ్స్ నమ్ముకునే రషీద్ ఖాన్.. ఈరోజు ముల్లాన్‌పూర్ నాకౌట్ మ్యాచ్‌లో కూడా డాట్ బాల్స్‌తో ప్రెజర్ క్రియేట్ చేసి రాజస్థాన్ కథ ముగించాలని ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నాడని పేర్కొన్నాడు.. మరోవైపు, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ మ్యాచులో అదిరిపోయే పర్ఫామెన్స్ చేసి జట్టుని ఫైనల్ కి చేర్చాలని చూస్తున్నాడు. దీంతో ఈ కీలక ఫైట్ లో వైభవ్ బ్యాటింగ్ పైనే అందరి నజర్ పెట్టారు.
