అత్తారింటికి వచ్చేశారా : గీతా గోవిందం కలిసే దీపావళి.. నెటిజన్ల సాక్ష్యాలు

అత్తారింటికి వచ్చేశారా : గీతా గోవిందం కలిసే దీపావళి.. నెటిజన్ల సాక్ష్యాలు

విజయ్ దేవరకొండ (VijayDevarakonda), రష్మిక మందన్నా (Rashmikamandanna) మధ్య రూమర్లు ఇప్పుడు కొత్తగా వచ్చేవి కాదు. గీత గోవిందం మూవీ నుంచే మొదలయ్యాయి. ఈ సినిమాలో ఇద్దరూ జంటగా నటించగా..వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. దీంతో టాలీవుడ్​ట్రెండింగ్​జంటగా విజయ్​ దేవరకొండ, రష్మిక మధ్య రిలేషన్ ఉందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఆ మధ్య ఈ జంట సీక్రెట్ వెకేష‌న్స్ గురించి కూడా..చాలా ఆరాలు తీయడం మొదలెట్టేశారు నెటిజన్స్. కానీ ఆ ఇద్ద‌రూ తాము మంచి ఫ్రెండ్స్ అంటూనే సమాధానం చెబుతున్నారు. లేటెస్ట్గా మరోసారి గీతా గోవిందం జంట తెరపైకి వచ్చింది. 

నిన్న రాత్రి (నవంబర్ 13) ర‌ష్మిక తన ఫ్యాన్స్ కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫొటోస్ షేర్ చేసింది. హ్యాపీ గా కూర్చుని..స్మైల్ ఇస్తూ దీపావళి సెలబ్రేట్ చేసుకునే ఫోటో షేర్ చేసింది కదా అని..అనుకోలేం ఇక్కడ. ఆ తర్వాతనే షురూ అయింది ఫ్యాన్స్కు అసలైన పండుగ.

హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో క‌లిసి దీపావళి జరుపుకుంటున్న ఫొటోస్ షేర్ చేశాడు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే..

  • ఇద్దరు వేరు వేరు ఫొటోస్ను పోస్ట్ చేసినా..ఆ ఫోటోల‌ మధ్య ఉన్న సారూప్యతలను గమనించారు నెటిజన్స్. ఇక దీంతో వారు ఉమ్మడిగా కలిసి దీపావ‌ళి జ‌రుపుకున్నారని అర్ధమైపోయింది.
  • అలాగే, రష్మిక కూర్చున్న కుర్చీ..ఆ వెనుకాల కనిపిస్తోన్న ఇంటి గోడ..రష్మిక పోస్ట్లో కనిపించింది.
  • విజయ్ టపాసులు కాల్చుతుంటే మొత్తం ఇంటి ఎంట్రన్స్లో ఉన్న గుమ్మం..ఆ ఇంటి గోడ కనిపిస్తుండటం.
  • అంతేకాకుండా..విజయ్ దేవరకొండ వేసుకున్న డ్రెస్ కలర్..రష్మిక డ్రెస్ కలర్ కాస్తా మ్యాచ్ అయ్యేలా కూడా ఉంది. 
  • అలాగే విజయ్ దేవరకొండ టపాసులు కాల్చుతుంటే..రష్మిక కూర్చొని చూస్తున్నట్టుగా ఉంది.  

ఇక ఈ ఫోటోల‌తో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై గుస‌గుస‌లు వినిపిస్తోన్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ జోడీ దాని గురించి పెదవి విప్పలేదు సుమ! ఇదిగో ప్రూఫ్‌..అత్తారింటికి వచ్చేశారా..గీత‌-గోవిందం దీపావ‌ళి పార్టీ.. అంటూ నెటిజన్ల సాక్ష్యాలతో ఈ ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు.